NLG: సాగర్ ఏరియా ఆసుపత్రి తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా మారిందని బాధితులు ఆరోపించారు. ఆధునిక వైద్య పరికరాలు ఉన్నప్పటికీ, ఇక్కడి సేవలు మాత్రం కనీసం పీహెచ్సీ స్థాయిలో కూడా లేవని ప్రజలు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి సాగర్ హిల్ కాలనీకి చెందిన మెహరున్నీసా బేగం పురుటినొప్పులతో రాగా, డ్యూటీలో ఉన్న వైద్యులు నిర్లక్ష్యంగా నల్గొండకు రిఫర్ చేశారని వాపోయారు.