ATP: గుంతకల్లులో నూతనంగా వార్డుల విభజన ప్రక్రియపై తప్పిదాలు సరిచేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణంలో నూతనంగా విభజించిన 10, 17, 33, 34, 40, 41 వార్డులో విభజన హద్దులను సరిచేయాలని అధికారులను కోరారు.