NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను పేరుసోమలకు చెందిన రామ్మోహన్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27 నుంచి శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని వారు బీసీ ఇందిరమ్మకు ఆహ్వాన పత్రికను అందజేశారు.