PLD: సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన వల్లెపు సహదేవుడి సెల్ఫోన్ తిరునాళ్లలో చోరీకి గురైంది. ఇటీవల బ్యాంక్ ఖాతా పరిశీలించగా రూ.1.49 లక్షలు విడతల వారీగా డ్రా అయినట్లు గుర్తించారు. ఫోన్ దొంగిలించిన వారే నగదు తీసి ఉంటారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హైమారావు తెలిపారు.