ADB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకుడు అశ్విన్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పలు అంశాలపై సుదర్శన్ రెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు.