చిత్తూరు రూరల్లోని అడవి చేను గ్రామంలో వినాయక ఆలయ కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.