ELR: నిడమర్రు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం రెండవ విడత ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు కార్యక్రమంలో కలెక్టరు కె. వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు హాజరయ్యారు. రెవెన్యూ వివాదాలు లేని గ్రామాలుగా రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల నుంచి 246 అర్జీలు స్వీకరించామన్నారు.