HNK: రాంనగర్లో ఓ యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సల్మాన్ అనే యువకుడు, తాను ప్రేమించిన యువతి దూరంగా ఉంటోందనే మనస్థాపంతో ఫ్లోర్ క్లీనర్ తాగినట్లు సమాచారం. ఘటనకు ముందు సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.