అన్నమయ్య: చిట్వేలు(M) కే.కందులవారిపల్లిలో 40 ఏళ్ల తర్వాత గంగమ్మ జాతర గురువారం ఘనంగా నిర్వహించారు. అప్పట్లో గ్రామం మొత్తం కలిసి జాతర జరిపేదని స్థానికులు తెలిపారు. అనంతరం ఊరు రెండుగా విడిపోవడంతో జాతర నిలిచిపోయిందన్నారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, పంటలు సమృద్ధిగా పండాలని యువత ముందుకొచ్చి ఈసారి జాతర నిర్వహించడం విశేషంగా నిలిచింది.