KRNL: నందవరంలో జరుగుతున్న భూ రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జిల్లా JC నూరుల్ ఖమర్ ఇవాళ పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూ సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.