NLG: వరి కొయ్యలను తగలబెట్టడం వలన భూమి భూసారం, పర్యావరణం దెబ్బతింటుందని మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు వేణుగోపాల్ అన్నారు. ఈరోజు మునుగోడు మండలం జనస్థానపల్లి గ్రామంలో వరికొయ్య కాళ్లపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి కొయ్యలను తగలపెట్టడం వల్ల నేల గట్టి పడుతుందని, వర్షపు నీటిని నిలుపుకోలేదని తెలిపారు.