NTR: పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు సమీపంలోని రాజేశ్వరి గట్టుపై గురువారం భారీ దావాగ్ని చెలరేగింది. ఎండల తీవ్రత, ఈదురుగాలులతో మంటలు కొండంతా వ్యాపించాయి. దట్టమైన పొగలు గ్రామాలను కమ్మేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, పంట పొలాలకు ముప్పు పొంచి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.