NLG: తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మాతంగి వీరబాబు ఈరోజు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాతంగి వీరబాబుకి అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.