MDK: బక్రీద్ పండుగ నేపథ్యంలో మెదక్ జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు ఆదేశించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది భద్రత కోసం తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ జాకెట్లు, ట్రాఫిక్ బ్యాటన్స్ ఉపయోగించాలని స్పష్టం చేశారు.