SDPT: అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ముంపు బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని శ్రీరాం తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆరోపించారు. కొత్త ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నప్పటికీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.