GDWL: పిచ్చికుక్క కరవడంతో బాలుడు మృతి చెందిన ఘటన గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం కోనేరులో చోటుచేసుకొంది. గ్రామానికి చెందిన 7 సంవత్సరాల జీవనను గత నెల 25న పిచ్చి కుక్క కరిచింది. ఈ నెల 17న బాబుకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చిన్నారి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.