ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. HYDలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటలకు చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న డెడికేషన్‌కు యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారట. ఇక ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.