JGL: కొండగట్టు అంజన్నకు రూ.1,38,000 విలువ చేసే 453 గ్రాముల వెండి గదను రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమెకు అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. టెంపుల్ సూపరిండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు.