KDP: భారత జనగణన-2027పై ప్రజల్లో అవగాహన కోసం బద్వేల్లో 5K రన్ నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో చంద్రమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోరుమామిళ్ల రోడ్డులోని ZPHS నుంచి బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు రన్ కొనసాగుతుందని తెలిపారు. కావున ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఎన్యూమరేటర్లు, SHGలు, NGOలు, ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.