ఆదిలాబాద్ శాంతినగర్ అంగన్వాడీ-2 కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ బాల్య దశ పూర్తి అయిన విద్యార్థులకు పట్టాలను అందజేసి వారితో సరదాగా గడిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్ కవిత మాట్లాడుతూ.. 3 నుంచి 5 సం.ల చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీలో చేర్పించాలన్నారు. అంగన్వాడీలో చదువుతోపాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.