BHPL: వేసవి కాలంలో ప్రజల దప్పికను తీర్చేందుకై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రమును ఏర్పాటు చేయడం జరిగిందని చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ అన్నారు. శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ఆమె ప్రారంభించి మాట్లాడారు. వివిధ అవసరాల నిత్యం బయటకు వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.