AP: కర్నూలులో గాల్‌బ్లాడర్ సమస్యతో వచ్చిన ఓ యువతికి ప్రైవేట్ ఆస్పత్రి వింత కండిషన్ పెట్టింది. ఆరోగ్యశ్రీ కార్డులో తల్లిదండ్రులతో కలిసి పేరు ఉండటంతో, పెళ్లి కాలేదని నిరూపిస్తేనే ఉచిత ఆపరేషన్ చేస్తామంటూ వెనక్కి పంపారు. పెళ్లి కాలేదని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారని బాధితురాలు ప్రశ్నించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.