NDL: శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక సత్రాల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని వివరించారు. ఈ ప్రయాణంలో సత్రాల నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.