దేశ వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. దీంతో స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ మినిట్స్ వంటి సంస్థల్లో కూలింగ్, హైడ్రేషన్ ఉత్పత్తుల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. తక్షణ ఉపశమనం కోసం ప్రజలు 10 నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ యాప్స్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఈ అమ్మకాల్లో ముందున్నాయి.