SRCL: తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్లో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. లూస్ లైన్ పోల్స్, యూనిఫామ్ సర్వీస్ లైన్, విద్యుత్ ప్రమాదాల నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్ ఉన్నారు.