టీమిండియా కెప్టెన్ రోహిత్‌పై సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు కీలక విషయాలను వెల్లడించాడు. ‘T20 WC 2024 ఫైనల్ ముందు రోజు రోహిత్ భాయ్ నా దగ్గరికి వచ్చి సిద్దంగా ఉండమన్నారు. కానీ టాస్ సమయంలో సేమ్ టీమ్‌ను ప్రకటించాడు. తర్వాత కారణాలను తెలుపుతూ నాతో ఆయన 10 నిమిషాలు మాట్లాడారు’ అని తెలిపాడు. ‘నువ్వో గొప్ప లీడర్’.. నీ సారథ్యంలో WC ఫైనల్ ఆడకపోవడం బాధపెట్టే విషయమని బదులు ఇచ్చానన్నాడు.