WGL: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు మే 1 నుంచి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు పోషకాహారాన్ని ఇంటికే పంపించే నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5,123 కేంద్రాల పరిధిలో ఉన్న సుమారు 1.88 లక్షల మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నెల రోజుల సరుకులు పంపిణీ చేయనున్నట్లు అంగన్వాడీ అధికారులు వెల్లడించారు.