JGL: జిల్లా కేంద్రంలోని జగిత్యాల – ధర్మారం ప్రధాన రహదారిపై మైనార్టీ బాలికల వసతి గృహం సమీపంలో గుంత ఏర్పడింది. రాత్రిపూట రోడ్డుపై వెలుతురు సరిగా లేకపోవడంతో పాటు వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆ గుంతలో పడి పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. చాలామంది వాహనదారులు గాయాల పాలయ్యారు. గుంతను పూడ్చి రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.