TG: KCRను కవిత విమర్శించడం మంచిది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన KCRను తిట్టడం బాధ కలిగించిందన్నారు. KCR లేకపోతే కవిత ఎవరు? అని ప్రశ్నించారు. తండ్రినే గౌరవించని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు ఎలా ఆదర్శమన్నారు. తొలి సభలోనే KCRను విమర్శించి.. ఆమె మర్యాద కోల్పోయిందన్నారు. కవిత పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదన్నారు.