గద్వాల: అలంపూర్ చౌరస్తాలోని రోషన్ గ్యాస్ ఏజెన్సీ వారిపై చర్యలు తీసుకోవాలని రాజోలి తహశీల్దార్ ఆఫీస్‌లో MRO రామ్మోహన్‌కు వినియోగదారులు వినతి పత్రం ఇచ్చారు. ప్రతి మంగళవారం రాజోలి గ్రామానికి గ్యాస్ బండి వచ్చేదని, ఇటీవల కాలం నుంచి రావడం లేదని, గ్యాస్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.