KMR: ఇల్లు లేని నిరుపేదలకు వరం ఇందిరమ్మ ఇళ్ల పథకమని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం పట్టణంలోని రెండవ వార్డులో ఇందిరమ్మ పథకం ద్వారా, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆమె ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మోతిలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.