ADB: వేసవి మొదలై నెల గడవకముందే ఆదిలాబాద్ జిల్లాలో నీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. ఎండల తీవ్రతతో వాగులు, వంకలు, చెరువులు ఎండిపోవడంతో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు పంచాయతీ ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తూ ఉపశమనం కల్పిస్తున్నారు. అయినా నీటి కోసం పరుగులు మాత్రం ఆగడం లేదు.