WGL: మే 6న వరంగల్లో BRS పార్టీ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించనున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారని వెల్లడించారు. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కాలేదని ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.