NGKL: నిన్న కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రైతులు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేయడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.