VZM: రామభద్రపురం, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముందుగా హాజరు పట్టికను తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.