WNP: పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె దవఖానాలు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పల్లె దవఖానాలు తెరిచి ఉంచాలని ఆదేశించారు. కేంద్రాలకు వెళ్ళని, సమయపాలన పాటించని సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.