ADB: ట్రైన్ ఆక్సిడెంట్లో ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం తాంసి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల దేవన్న(38) హాసనపూర్ శివారులో ట్రైన్ ఆక్సిడెంట్లో మరణించాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.