W.G: ఇరగవరం మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణంగా వరి కోత యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు కళ్లాలని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వరి పొలాల్లో కళ్లాలు అందుబాటులో లేకపోవడంతో రోడ్డుపైనే ధాన్యం రాశులు పోసి ఆరబెడుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెడుతూ ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.