NRPT: వేసవి సెలవుల్లో పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. ఈత రాని వారు నదులు, చెరువులు, బావుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు తమ వెంట తల్లిదండ్రులను లేదా శిక్షకులను తీసుకెళ్లాలని, ఈత సరదా ప్రాణాపాయంగా మారకుండా చూసుకోవాలని ఆయన కోరారు.