NGKL: జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సాగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘దిశ’ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు.