కర్నూలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మండపంలో శుక్రవారం మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐ మారుతి శంకర్ పాల్గొని పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణపై వివరించారు. సమస్యలు ఎదురైతే శక్తి యాప్, డయల్ 112, మహిళా హెల్ప్‌లైన్ 1091, చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు.