SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. దాత బొంపల్లి రామారావు ఆర్థిక సహకారంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంక లక్ష్మీ చందు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి దాతలు, గ్రామస్తులు ముందుకు వచ్చారు.