SRPT: తిరుమలగిరి మండలంలో భానుడు విశ్వరూపం చూపించాడు. నేడు ఏకంగా గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని వైద్యులు మండల ప్రజలకు సూచిస్తున్నారు.