ADB: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని యోగానంద సరస్వతితో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పాశ్చాత్తా పోకడలకు పిల్లలు అలవాటు కాకుండా చూడాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు.