VSP: 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అవుతాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని డీఈవో ప్రేమకుమార్ తెలిపారు. ఫలితాల విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని స్పష్టం చేశారు. అధికారికంగా ప్రకటించిన తేదీనే నమ్మాలని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.