ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో టీడీపీ పార్టీ మండల సమావేశం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు పై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.