NGKL: జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ భేటీకి ఎంపీ డాక్టర్ మల్లు రవితో పాటు ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిపై ఈ సందర్భంగా అధికారులతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు.