TG: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవమున్న సీవీ ఆనంద్‌ను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే, మే మొదటి వారంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.