BDK: ఈటల రాజేందర్ విజ్ఞప్తి మేరకు మణుగూరు వరకు రైళ్లపొడిగింపు కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్ళింది. ట్రైన్ నం.17033/17034 భద్రాచలం బాలహర్షా ఎక్స్ప్రెస్ పాటు మరో రెండు రైళ్లను మణుగూరు వరకు పొడిగించే ప్రతిపాదనను పరిశీలనకు పంపినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై నిర్వహణ పరమైన సాధ్యతపై పరిశీలన కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.