CTR: గుడిపాల మండలం తుమ్మల వారి పల్లెలో బెత్ షోలోమ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. వృద్ధులకు ట్రస్ట్ అందిస్తున్న సేవలను వారు అభినందించారు. సమాజానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.